దిశా నిందితుల ఎన్కౌంటర్ పై సెలబ్రిటీలు ఎవరేమన్నారంటే…..??

-

లేడీ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంత నిందితులను నేటి తెల్లవారుఝామున ఆమెను కాల్చి వేసిన చోటనే పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు సహా పలువురు సినిమా ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణం జరిగి పదిరోజులు కాకముందే నిందితులకు సరైన శిక్ష విధించిన పోలీసులు మరియు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పై కూడా ప్రజలు అభినందనలు తెలియచేస్తున్నారు. ఇక ఈ ఎన్కౌంటర్ ఘటనపై సెలెబ్రిటీలు ఎవరేమన్నారంటే….??

అఖిల్ అక్కినేని : ఇటువంటి దారుణ ఘటనలపై సరైన న్యాయమే జరిగింది. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరింది….!!

పూరి జగన్నాథ్ : సెల్యూట్ ,,,తెలంగాణ పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను మీరే నిజమైన హీరోలు . నేను ఎప్పుడూ ఒక్కటే నమ్ముతాను, అదేమిటంటే, మనకి కస్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే… !!

రవితేజ : దిశా నిందితుల ఎన్కౌంటర్ తోనే ఇది ఆగిపోలేదు, ఇప్పుడే మొదలయింది.. చిన్నప్పటి నుండి మన పిల్లలకు ఆడవారి పట్ల గౌరవం మర్యాద నేర్పినపుడే మనం పూర్తిగా విజయం సాధిస్తాం. దిశా ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను….!!

అనిల్ రావిపూడి : తెలంగాణ పోలీసులకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు,,, ఈ భయం చాలా అవసరం…!!

సమంత అక్కినేని : ఈ ఘటన గురించి నేను ఏమి మాట్లాడలేను, మొదట దిశా హత్య ఘటన జరిగినపుడు మీరు ఎందకు ఖండించలేదు అంటూ నాపై కామెంట్స్ దాడి పెరిగింది. నేను ఒక్కదానినే ఖండిస్తే సరిపోతుందా, అందరం కలిసి కట్టుగా ఇటువంటి దారుణాలు జరుగకుండా బాధ్యతగా వ్యవహరిస్తేనే వీటిని భవిష్యత్తులో ఆపగలం. దిశా ఆత్మకు శాంతి చేకూరాలి…!!

సాయిధరమ్ తేజ్ : క్షమించు చెల్లెమ్మా, నిన్ను కాపాడుకోలేకపోయాము… కానీ ఆ నీచులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడమే సరైన శిక్ష. నీ ఆత్మకు శాంతి చేకూరాలి…!!

అనసూయ భరద్వాజ్ : ఈ ఘటన వినగానే నాకు ఎంతో సంతోషం వేసింది…..!!

లక్ష్మి మంచు : ఇది ఏమాత్రం నాకు తప్పుగా అనిపించలేదు, రేపిస్టుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఈ విధంగా త్వరగా నిందితులను ఎన్కౌంటర్ తో శిక్షించడం మంచి విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు…!!

నాని : వూరికి ఒక్కడే రౌడీ ఉండాలి…. వాడే పొలిసు అయి ఉండాలని కోరుకుంటున్నాను…..!!

నాగార్జున అక్కినేని : పొద్దున్నే నిద్ర లేవడంతోనే ఈ మంచి వార్త విన్నాను,,,, ఈ ఘటనతో తప్పకుండ ప్రియాంక ఆత్మ శాంతిస్తుంది….!!

హరీష్ శంకర్ : మా సినిమాల టీజర్లు మరియు ట్రైలర్లు లికె చేసినా, షేర్ చేసినా చేయకపోయినా ఈ విషయాన్నీ మాత్రం అందరూ కలిసి మరింతమందికి చేరేలా వెలుగెత్తి చాటండి. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలి…..!!

రకుల్ ప్రీత్ సింగ్ : ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి, ఆపై ఆమెను కిరాతకంగా మర్డర్ చేసి ఎక్కడికి పారిపోదాం అనుకున్నారు… మీకిదే తగిన శిక్ష….. !!

నిఖిల్ సిద్దార్ధ : మొత్తానికి ఈ నీచులకు తగిన శాస్తి జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకున్నదని కోరుకుందాం. ప్రియాంక అత్త నేడు తప్పకుండ శాంతిస్తుంది అని కోరుకుంటున్నాను….!!

ఏ ఆర్ మురుగదాస్ : ఆ నీచులను చంపిన హైదరాబాద్ పోలీసులకు నా సెల్యూట్, ఆడవారికి పూర్తి రక్షణ నిచ్చేలా మన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను…..!!

బాలకృష్ణ : పోలీసులు గొప్ప పని చేసారు, ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరింది. ఇకపై ఆడబిడ్డలపై ఇటువంటి ఘాతుకాలకు తెగబడాలంటే మృగాళ్లు భయపడేలా సజ్జనార్ గారు వ్యవహరించారు….!!

బోయపాటి శ్రీను : ప్రియాంకకు న్యాయం చేయలేకపోయినా, ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చే పనిని పోలీసులు చేసారు. ఇకపై ఇటువంటి దారుణాలు చేయడానికి అందరూ భయపడేలా చేసారు. తెలంగాణ పొలిసు వారికి ధన్యవాదాలు….!!

Read more RELATED
Recommended to you

Exit mobile version