కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఫలితంగా భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. దీంతో మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరగనుంది. ఈ మేరకు కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించినట్లు తెలుస్తోంది.
ధరలు తగ్గేవాటిలో మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, మెరైన్ ప్రొడక్స్, ఎల్‌ఈడీ లైట్స్, వెట్ బ్లూ లెదర్, ఓపెన్ సెల్, 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్ , ఫ్రెజెన్ ఫిష్ పేస్ట్ (సురిమి), కారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లు, 25 రకాల క్రిటికల్ మినరల్స్, జింక్, లిథియం అయాన్ బ్యాటరీస్క్రాప్ మొదలగునవి. ఇక ధరలు పెరిగే వాటిలో ప్లాట్ ఫ్యానెల్ డిస్ ప్లే, నిటెడ్ ఫ్యాబ్రిక్స్ (అల్లిన దుస్తులు) ఉన్నాయి.