మనోజ్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

-

మంచు కుటుంబంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు మంచు మనోజ్. ఈ నటుడు మొదట దొంగ దొంగది అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించారు. ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగానే ఉంటారు మంచు మనోజ్. అయితే ఇటీవల కాలంలో మనోజ్ పేరు తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. మనోజ్ సినిమాలలో నటించక నాలుగేళ్లు కావస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనికను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఇంకా క్లారిటీ రాలేదు. ఇక మనోజ్ మొదటి భార్య ప్రణీత రెడ్డి విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అని అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ప్రణీత రెడ్డి అమెరికాలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఈమె ఒక ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్ గా తన పనిలో తాను బిజీగా ఉంటూ ప్రస్తుతం తన సింగల్ లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి

అయితే మనోజ్ , ప్రణీత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మంచు విష్ణు భార్య విరాణికా రెడ్డి , ప్రణీత మంచి స్నేహితులు. అంతేకాకుండా దూరపు బంధువులు కూడా.. అందుచేతనే మనోజ్ ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన కొంతకాలానికి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడం జరిగింది. ఒకానొక దశలో ప్రణీత రెడ్డి కూడా డిప్రెషన్ కు చాలా గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలోనే నా దేవత అంటూ మనోజ్ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేయడం జరిగింది.. దీంతో అప్పటికే వీరు ఇరువురు విడిపోయారు అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరిద్దరు విడిపోయిన విషయాన్ని మాత్రం ఎక్కువ కాలం దాచలేకపోయాడు మంచు మనోజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version