డాక్టర్ కాబోయే యాక్టర్ అయినా మన నటీనటులు ఎవరో తెలుసా..

-

కొంత మంది తారలు డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయ్యానని అంటుంటారు కదా.. ఇది మాటవరసకు ఎవరు అన్నారో తెలియదు కానీ.. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది విషయంలో నిజం అవుతోంది. ఇప్పటికే సాయి పల్లవి ఒకవైపు డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు హీరోయిన్​గా కూడా వరుస అవకాశాలు అందుకుంటూ రాణిస్తోంది. అయితే అలాంటి హీరోయిన్లు ఇంకా చాలా మందే ఉన్నారు. నిజంగానే వైద్య విద్యను అభ్యసించి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. వారెవరె తెలుసుకుందాం..

నటుడు డాక్టర్​ రాజశేఖర్​ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్​ ఇప్పుడిప్పుడే హీరోయిన్​గా రాణిస్తోంది. అద్భుతంతో తెరంగేట్రం చేసిన శివాని కూడా ఎంబీబీఎస్​ చదివింది.

మలయాళం ప్రేమమ్​తో సినీ ప్రేక్షకుల్ని కట్టిపడేసిన సాయిపల్లవి.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్. మంచి డ్యాన్సర్​. చదువులో ఎప్పుడూ ముందుంటే ఈ హైబ్రీడ్ పిల్ల.. జార్జియాలో వైద్య విద్య పూర్తి చేసింది.

గాడ్సేతో తెలుగు వారికి పరియచయమైన మలయాళీ భామ.. ఐశ్వర్య లక్ష్మీ కూడా డాక్టరే. కేరళలోని ఎర్నాకుళంలో శ్రీనారాయణ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్​ సైన్స్​లో ఎంబీబీఎస్​ పూర్తి చేసింది. ఇటీవలే ఆమె నటించిన అమ్ము ఓటీటీలో విడుదలై మంచి టాక్​ తెచ్చుకుంది.

కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడితో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. అమెరికాలో పుట్టి బెంగళూరులో పెరిగిన ఈ తెలుగుమ్మాయి వైద్య విద్యను అభ్యసిస్తోంది.

సత్యదేవ్​ హీరోగా 2020లో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో తొలి సాగి నటించింది రూప కొడువయూర్​ ఆంధ్రప్రశ్​లో ఎంబీబీఎస్​ చేసింది. ప్రస్తుతం బిగ్​బాస్​ ఫేమ్​ సోహైల్​ హీరోగా తెరకోక్కుతోన్న మిస్టర్​ ప్రెగ్నెంట్​లో నటిస్తోంది.

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్​ మోడలింగ్​లో రాణిస్తూనే హరియాణాలోని భగత్​ ఫూల్​ సింగ్​ మెడికల్​ కాలేజ్​లో వైద్యవిద్య పూర్తి చేసింది. పృథ్వీరాజ్​తో కథానాయికగా బాలీవుడ్​లో తెరంగేట్రం చేసింది.

కార్తి హీరోగా వచ్చిన విరుమన్​ దిగ్గజ దర్శకుడు చిన్న కుమార్తె అదితి శంకర్​ హీరోయిన్​గా మారింది. నటిగా తన కెరీర్​ను ప్రారంభించకముందే చెన్నైలోని ఓ వర్సిటీలో ఎంబీబీఎస్​ చదువుకుంది.

సుమంత్​ మళ్లీ రావా నాగార్జున నాని కలిసి నటించిన దేవదాసుతో అలరించిన నటి ఆకాంక్ష సింగ్​ ఆమె వైద్యురాలు కాకపోయినా వైద్య విద్యలో భాగమైన ఫిజియోథెరపీ చదువుకుంది.

తమ్ముడు సినిమాలో పవన్​ కల్యాణ్​ గర్ల్​ఫ్రెండ్​ గా లవ్లీ పాత్రలో నటించిన భామ.. ఆ తర్వాత బాలీవుడ్​కే పరిమితమైంది. 1997లోనే ఎంబీబీఎస్​ పూర్తి చేసింది. గైనకాలజీ ఎం.ఎస్​ చేసి ఆ తర్వాత మోడలిం​గ్​ సినిమాల్లోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version