వివాహానికి సిద్ధమైన ఎనర్జిటిక్ హీరో.. పెళ్లి కూతురు ఆమెనా ..?

-

ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు తమ బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలుకుతూ .. వివాహబంధంతో ఏడు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోని ఎనర్జిటిక్ యంగ్ బాయ్ రామ్ పోతినేని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక వై.వి.యస్.చౌదరి తెరకెక్కించిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అప్పటివరకు చాక్లెట్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని 16 సంవత్సరాల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్న ఈయన.. ఇస్మార్ట్ శంకర్ ద్వారా తనలోని మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించి మంచి మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

ఇక తాజాగా రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న రామ్ పోతినేని.. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగస్వామి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక పోలీస్ ఆఫీసర్ గా ఈ సినిమాలో నటిస్తూ ఉండగా.. ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల కాకముందే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇకపోతే రామ్ పోతినేని తన చిన్ననాటి క్లాస్మేట్ ని ప్రేమించి వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

ఆగస్టు నెల శ్రావణ మాసంలో ఎంగేజ్మెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయని పెళ్లి మాత్రం నవంబర్ నెల కార్తీకమాసంలో జరగనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే వీరిద్దరి పేర్లతో ముహూర్తం కూడా నిర్ణయం అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పెళ్లి జరిగే నెల అయితే కన్ఫామ్ అయ్యింది కానీ పెళ్లి డేట్ కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version