Jani Master: జానీ మాస్టర్ 7 ఏళ్లు జైలు శిక్ష… బాధితురానికి భద్రత పెంపు !

-

జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు పోలీసులు. మూడు రోజులుగా పరారీలో జానీ మాస్టర్ ఉన్నారు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై కేసు నమోదు కావడం జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ పై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. జానీ పరారీ లో ఉన్నాడు అంటున్న పోలీసులు…జానీ మాస్టర్ బాధితురానికి భద్రత పెంచారు.

Jani Master

జానీ పై నాన్ బెయిలబుల్ కేస్ ఉందని చెబుతున్నారు. జానీ పై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని.. మాపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. ఇలాంటి కేసులలో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని… పోక్సో చట్టం కూడా యాడ్ చేసామని వెల్లడించారు. పోక్సో కేసు కు ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని.. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు చిక్కులు తప్పవని అంటున్నారు. గత మూడు రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు పరారైన జాని మాస్టర్..గోవాలో ఉన్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version