తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవలే చెప్పడం జరిగింది. అయితే ఈ హీరోకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉందని టాక్ నడుస్తోంది. ఆ అమ్మాయి మరెవరో కాదు సింగర్ కెనీషా. ఈ అమ్మాయితో ఉన్న ఎఫైర్ కారణంగానే తన భార్యతో జయం రవి విడాకులు తీసుకుంటున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. జయం రవి తరచుగా గోవా వెళ్లేవాడు.
అక్కడే ఓ బంగ్లాను కూడా కొనుగోలు చేశాడు. తరచూ గోవా వెళుతూ ఉండడం వల్ల అక్కడ ఓ బంగ్లాను కొనుగోలు చేసి ఆ సింగర్ తో పాటు అక్కడే ఉంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం జయం రవి భార్యకు తెలిసినప్పటికీ వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి ఆమెను శాంతింపచేశారట. ఇంత పెద్ద విషయం తెలిసిన ఆర్తి సైలెంట్ గా ఉండడంతో జయం రవి విడాకుల విషయం చెప్పడంతో ఆర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.