“మామా మశ్చీంద్ర” సినిమాలో ప్రతి పది నిమిషాలకు సర్‌ఫ్రైజ్ : ఈషా రెబ్బా

-

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌ లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్‌ హీరో. అయితే ఇటీవల సరికొత్త అవతారంలో కనిపించాడు సుధీర్ బాబు. “మామ మశ్చీంద్ర” అనే సినిమా కోసం సుదీర్ బాబు ఈ బబ్లి లుక్ లో కనిపించాడు. బుగ్గలు, పోట్ట ఇలా తను ఇంతవరకు ఎప్పుడు కనిపించని రూపంలో దర్శనం ఇచ్చాడు.

అయితే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన “మామా మశ్చీంద్ర” సినిమాలో బోలెడన్ని ట్విస్ట్ లు ఉన్నాయని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ఈ నెల 6న మూవీ థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. సినిమాలో తన పాత్ర చాలా హైపర్ గా ఉంటుందని చెప్పారు. టైలర్ చూసి కథ ఇదే అనుకుంటే పోరపడినట్లేనని…. ప్రతి పది నిమిషాలకు ఒక సర్ప్రైజ్ ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో గెటప్స్ కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version