వారి చేతిలో మోసపోయి కోట్లు పోగొట్టుకున్న ఎఫ్ -2 నటుడు..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలోని పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి.. అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యాక్టర్ ప్రదీప్ కూడా ఒకరు..F2 సినిమాలో అంతేగా అంతేగా అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఎఫ్3 సినిమాలో కూడా ప్రగతి భర్తగా తమన్నా తండ్రిగా నటించారు ప్రదీప్.. ఇవే కాకుండా పలు చిత్రాలలో కూడా నటించారు ప్రదీప్ సీరియల్స్ లో కూడా చేసినప్పటికీ ఎక్కువగా గుర్తింపు తెచ్చి పెట్టింది మాత్రం F -2,F-3 చిత్రాలని చెప్పవచ్చు.

ఈ సినిమాలలో కేవలం అంతేగా అంతేగాని డైలాగుతో పాపులారిటీ సంపాదించిన ప్రదీప్..ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలను తెలియజేస్తూ కన్నీరు పెట్టుకోవడం జరిగింది.. ప్రదీప్ మాట్లాడుతూ తను సినిమాలలోకి వచ్చాక ఎన్నో వందల కోట్లు సంపాదించాను కానీ సంపాదించిన వందల కోట్లు కూడ తెలిసిన వారే తనని మోసం చేశారని.. తెలిసిన వారి చేతిలో బిజినెస్ వంటివి పెట్టి చాలా మోసపోయానని తెలియజేశారు.. నేను చేసిన తప్పు వల్లే డబ్బులు అన్నీ పోయాయని కూడా తెలియజేశారు ప్రదీప్.

తన జీవితంలో జరిగిన ఈ ఎదురు దెబ్బ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని తన జీవితం రోడ్డు మీద పడ్డాకే తనకు ఎవరిని నమ్మకూడదనే విషయం అర్థం అయిందని ఇది ఒక గుణపాఠం వంటిదని ఎమోషనల్ అవుతూ తెలియజేశారు. చివరికి తన సొంత ఇల్లు అమ్మి కూడా అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీంతో తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తెలుసుకొని అప్పటినుంచి ఎవరిని నమ్మడం మానేశానని తెలిపారు.. ప్రస్తుతం సీరియల్స్ లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి తిరిగి డబ్బు సంపాదించుకోగలుగుతున్నాను అంటూ తెలిపారు ప్రదీప్.

Read more RELATED
Recommended to you

Exit mobile version