F3 Trailer : ఎఫ్‌-3 మూవీ ట్రైలర్‌ రిలీజ్.. దుమ్ములేపిన వెంకీ, వరుణ్

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా,తమన్నా భాటియా, మెహరిన్ పిర్జాదా హీరోయిన్‌‌‌‌లుగా కలిసి నటించిన చిత్రం F3. దిల్ రాజు ప్రొడక్షన్‌లో తెరకెక్కిన ఈ పిక్చర్ కు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

ఈ చిత్రం కామెడీ ఎంటర్ టైనర్ గా 2019లో తెరకెక్కిన F2 సినిమాకు సీక్వెల్. ఈ సినిమా అప్ డేట్స్ వరుసగా ఇచ్చేస్తున్నారు మేకర్స్. సమ్మర్ లో రిలీజ్ అయ్యే బెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ఇదే అనేంతలా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇటీవల ఈ మూవీ నుంచి సాంగ్స్ రిలీజ్ చేసిన మేకర్స్..తాజాగా మరో అప్ డేట్ ఇచ్చేశారు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్‌ లో వెంకీ మామా, వరుణ్‌ తేజ్‌ తమ కామెడీ టైమింగ్‌ తో అదరగొట్టారు. ఎఫ్‌ 2 ను మించిన కామెడీ ఈ మూవీలో ఉంది. కాగా.. ఈ సినిమా మే 27 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version