పవన్ కల్యాణ్‌ తొలి ఇన్‌స్టా పోస్ట్‌.. క్షణాల్లో వైరల్

-

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ ఎంట్రీ ఇచ్చిన క్షణాల్లోనే లక్షల మంది ఫాలోవర్స్​ను సొంతం చేసుకున్నారు. ఒక్క పోస్టు కూడా లేని పవన్ అకౌంట్ గంటల వ్యవధిలోనే రికార్డు నంబర్ ఫాలోవర్స్​తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా పవర్​ స్టార్ తొలి ఇన్​స్టా పోస్టు చేశారు. అదేంటో ఓసారి మీరూ చూసేయండి.

‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .. జై హింద్!” అనే స్లోగన్‌తో ఇన్‌స్టాలోకి పవన్‌ కల్యాణ్ అడుగు పెట్టిన పవర్ స్టార్.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. ‘‘చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నాను’’ అని ఆ వీడియో ప్రారంభమైంది. దీనికి ‘‘మన బంధం ఇలాగే కొనసాగాలని, ఎన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ..’’అని క్యాప్షన్‌ను జోడించారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు షేర్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version