మంచు ఫ్యామిలీ వివాదం ముదురుతోంది. తాజాగా మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు విష్ణు అనుచరులు. జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ వచ్చారు. ఈ తరుణంలోనే మంచు మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు విజయ్.
మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు, ప్రైవేట్ బౌన్సర్ల తో కాపలా కాస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు…మంచు మనోజ్ ఇంటికి వెళ్లనున్నారు. కాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నారట.
కాగా తన అనుచరుల చేత మోహన్‌బాబు నాపై దాడి చేయించారన్నారు మనోజ్. మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాలు చూసుకునే వినయ్ నన్ను కొట్టాడని తెలిపారు. మా నాన్న చెప్పడం వల్లే అతను నాపై దాడికి తెగబడ్డాడని వివరించారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ ప్రకటించారు మంచు మనోజ్.