బిగ్ బాస్ షో తో గంగవ్వ అన్ని లక్షలు సంపాదించిందా. లెక్క మారిపోయిందే..?

-

బిగ్ బాస్ సీజన్ 4 భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. లాంచింగ్ అండ్ ఫినాలే ఎపిసోడ్ తో పాటు ఓవర్ ఆల్ గా షో టి ఆర్ పి రేటింగ్ లో కూడా దుమ్ము దులిపేసింది. మొదట్లో సీజన్ 4 అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఆడియన్స్ భావించారు.. అందుకు కారణం కంటెస్టెంట్స్ పెద్దగా పాపులారిటీ లేని వాళ్ళు.. చాలామంది యూట్యూబర్స్ ఇందులో అడుగు పెట్టారు ఎంపికైన ప్రతి కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లే ముందు రెండు వారాలు క్వారెంటైన్ చేయాలని నిబంధన కూడా పెట్టారు. కోవిడ్ ఆంక్షలు నేపద్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా హౌస్ లో వెళ్లడానికి ఆసక్తి చూపలేదు ఈ క్రమంలోని గంగవ్వ వంటి సోషల్ మీడియా సెలబ్రిటీలకు అవకాశం దక్కింది.

నిజానికి గంగవ్వను ఎంపిక చేయడమే ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. ఒక పల్లెటూరు వృద్ధ మహిళ బిగ్ బాస్ షోలో ఎలా ఉంటారనే ఉత్కంఠ అందరిలో కలిగింది. గంగవ్వ తన మార్కు చూపించింది. హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ప్రేమ కూడా సంపాదించుకుంది. పల్లెటూర్లో పనులు చేసుకుంటూ నలుగురిలో కలివిడిగా తిరిగే గంగవ్వ నాలుగు గోడల మధ్య ఉండలేకపోయారు. దీంతో హోమ్ సిక్ కి గురై అనారోగ్యం బారిన పడ్డారు. డాక్టర్స్ సలహా మేరకు గంగవ్వను ఎలిమినేట్ కాకుండానే బయటకు పంపేశారు. ఇకపోతే ఇల్లు కట్టుకోవాలన్న ఆశతోనే గంగవ్వ ఈ షో కి వచ్చాను అని తెలిపింది. అది తీరకుండానే వెళ్ళిపోతున్నానని పోస్ట్ నాగార్జునతో చెప్పింది.

అయితే నీ కోరిక నేను తీరుస్తాను అని ఇల్లు కట్టుకోవడానికి ఆయన గంగవ్వకు సుమారుగా రూ.7 లక్షల రూపాయలు ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లో 5 వారాలు ఉన్నందుకు రూ.10 లక్షలు గంగవ్వకు ఇచ్చారు. వారానికి రూ.2 లక్షలు అంటే మామూలు విషయం కాదు. అలా మొత్తం రూ. 17 లక్షల సమకూరాయి. ఇక మిగతా డబ్బులతో సుమారుగా రూ.20 లక్షలు ఖర్చు చేసి తన కొత్త ఇంటిని నిర్మించుకుంది గంగవ్వ.

Read more RELATED
Recommended to you

Exit mobile version