బిగ్​బాస్-7లో ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా..?

-

బిగ్‌బాస్‌ సీజన్‌-7లో ఈ వారం ఓ కీలక సభ్యుడు ఎలిమినేట్ అయ్యాడు. అతనెవరో కాదు అశ్వత్థామ 2.0 అలియా గౌతమ్‌ కృష్ణ. ఈ వారం ఎలిమినేషన్‌లో అర్జున్‌ అంబటి, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, పల్లవి ప్రశాంత్‌, గౌతమ్‌ కృష్ణ, శివాజీ ఉండగా.. ఎలిమినేషన్‌లో చివరకు శోభా, గౌతమ్‌ మిగిలారు. వీరిద్దరిలో చివరకు గౌతమ్ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

అంతకుముందు బిగ్‌బాస్‌ సీజన్‌-7 ఫైనల్‌ విజేత రూ.50 లక్షలు, కారు, రూ.15 లక్షల విలువైన బహుమతులు గెలుపొందుతారని నాగార్జున చెప్పారు. ఇక గౌతమ్ ఇంటి నుంచి వెళ్లే ముందు హౌస్‌లో ఎవరికి మాస్క్‌ ఉంది, ఎవరికి మాస్క్‌ లేదు అనేది చెప్పాలని నాగార్జున కోరగా.. అర్జున్, ప్రియాంకలకు మాస్కు లేదని చెప్పాడు. ప్రియాంకను ఫైనల్​లో చూడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. మరోవైపు అమర్‌ గురించి మాట్లాడుతూ మాస్క్‌ వచ్చి పోతుంటుందని.. ఫన్నీగా ఉండని సూచించాడు.

శోభకు అప్పుడప్పుడు మాస్క్ వస్తుందని చెబుతూనే గేమ్‌పై పోకస్‌ చేయమని సలహా ఇచ్చాడు. యావర్​కు మాస్కు లేదని మంచిగా ఆడాలని చెప్పాడు. ప్రశాంత్‌కు శివాజీని కొట్టి పైకి రావాలని సూచించాడు. ఇక శివాజీకి చిన్న మాస్క్‌ ఉందని చెప్పి వెళ్లిపోయాడు గౌతమ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version