వ‌రుణ్ తేజ్ ‘గ‌ని’ విడుద‌ల తేదీ ప్ర‌క‌ట‌న‌.. ఎప్పుడంటే..?

-

గ‌ని.. బాక్సింగ్ బ‌రిలోకి దిగాడు అంటే ఎంత‌టి ప్ర‌త్య‌ర్థి అయినా స‌రే చిత్తు కావాల్సిందే. గుండెల నిండా ఆత్మ‌విశ్వాసం, ల‌క్ష్య సాధ‌న ప‌ట్ల చిత్త శుద్ది క‌లిగిన అత‌ని జీవిత ప్ర‌యాణం ఈ సినిమా అని కిరణ్ కొర్రపాటి పేర్కొంటున్నారు. వ‌రున్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం గ‌ని. ఈ సినిమాను సిద్దు ముద్ద‌, అల్లుబాబీ నిర్మిస్తున్నారు. స‌యి మంజ్రేక‌ర్ క‌థానాయిక‌. తొలుత ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి నెల‌లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించింది చిత్ర బృందం.

మ‌ర‌ల ఆ త‌రువాత మార్చి 18న విడుద‌ల చేయ‌బోతున్నార‌ని ప్ర‌క‌టించారు. కానీ అది కూడా వాయిదా ప‌డి తాజాగా ఓ కొత్త తేదీని ప్ర‌క‌టించింది చిత్ర బృందం. ఏప్రిల్ 08న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుద‌ల కానున్న‌ట్టు ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ పాత్ర చిత్రీక‌ర‌ణ స‌రికొత్త పంథాలో ఉంటుంది.

బాక్సింగ్ నేప‌థ్యంలో శ‌క్తిమంత‌మైన యాక్ష‌న్ మూవీగా అల‌రిస్తుంద‌ని చిత్ర బృందం పేర్కొంటుంది. ఇటీవ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్‌, పాట‌ల‌కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫి జార్జ్ సి విలియ‌మ్స్‌, సంగీతం థ‌మ‌న్‌, ద‌ర్శ‌క‌త్వం కిర‌ణ్ కొర్ర‌పాటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version