హంసానందిని అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆమె తన అందంతో కోట్లాదిమంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఆమె వంశీ డైరెక్షన్‌లో వచ్చిన అనుమానస్పదం సినిమాద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అంతకంటే ముందు కూడా ఒకట్రెండు సినిమాలు చేసినప్పటికీ.. వాటికి పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే అనుమానస్పదం మూవీ మాత్రం హంసా నందినిగా స్థిర పడిపోయేలాగా చేసింది. ఈ సినిమా ద్వారా హంసా ప్రేక్షకులకు గుర్తుండి పోయిందనే చెప్పాలి. ఈ మూవీ తర్వాత టాలీవుడ్‌లో చాలా సినిమాలు చేసింది ఈ హాట్ బ్యూటీ.
క్యారెక్టర్లతో పాటే కొన్ని స్పెషల్ సాంగ్స్ అలాగే ఐటమ్ సాంగులు చేస్తూ రెచ్చిపోయింది. ఇక కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలు కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు తన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తన హాట్ ఫొటోలను ఎప్పటి కప్పుడూ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరల్‌గా మారాయి. అవేంటో మీరు కూడా చూడండి.