జీ తెలుగు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో హనుమాన్​ హీరో తేజ సజ్జ.. ఈరోజు రాత్రి 7 గంటలకు!

-

తెలుగు ప్రజలకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్​తో ప్రేక్షకులను అలరించే జీ తెలుగు ఛానల్​ అందిస్తున్న సూపర్​హిట్​ సీరియల్​నిండు నూరేళ్ల సావాసం. మొదటి ఎపిసోడ్​ నుంచే అశేష ప్రేక్షకాదరణతో సక్సెస్​ఫుల్​గా కొనసాగుతున్న ఈ సీరియల్​ ఈరోజు ఎపిసోడ్లో హనుమాన్​ సినిమా హీరో తేజ సజ్జ స్పెషల్​ ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘హనుమాన్’ సినిమా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ కోసం తేజ సజ్జని ‘హనుమాన్’ రూపంలో ఈ సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

 

ఓ ఆర్మీ​ మేజర్ కుటుంబ కథతో సాగుతున్న సీరియల్​ నిండు నూరేళ్ల సావాసం. ప్రేమ, ఆప్యాయత మధ్య సాగే ఈ సీరియల్​ రోజురోజుకీ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్లో అమర్​, అరుంధతి, భాగమతి ప్రధాన పాత్రలు కాగా మనోహరి విలన్​గా అదరగొడుతోంది. అరుంధతి చనిపోవడం, అమర్​ జీవితంలోకి రావాలని మనోహరి ప్రయత్నం, భాగమతి జీవితంలోకి అమర్ రావడంతో ఈ సీరియల్​ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సీరియల్​ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రసారమవుతోంది.

జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అర్ధాంతరంగా చనిపోయిన ఒక తల్లి ఆత్మ రూపంలో పిల్లల బాగోగులు చూసుకోవడానికి తపన పడటం కథాంశంగా వస్తున్న ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. పిల్లల కోసం తల్లి పడే తపన ప్రేక్షకుల హృదయాలని కట్టిపడేస్తోంది.

ఆడుకుంటూ కిందపడిన తన కూతుర్ని చూసి ఆత్మ రూపంలో ఉన్న అరుంధతి ఎంతో బాధపడుతుంది. నా కూతురు బాధని తగ్గించే శక్తిని ప్రసాదించు అని హనుమంతుడిని వేడుకుంటుంది. ఆమె ప్రార్థన విన్న హనుమంతుడు మానవ రూపంలో ఆమె దగ్గరికి వస్తాడు. అతడిని చూసి ఆనందపడుతుంది అరుంధతి. అయితే హనుమంతునిగా తేజ సజ్జా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. హనుమాన్ రూపంలో ఎంట్రీ ఇచ్చిన తేజ అరుంధతికి ఎలాంటి శక్తిని ఇస్తాడు అంజూని ఏ విధంగా కాపాడుతాడు అరుంధతిని బంధించాలని చూస్తున్న ఘోరని శిక్షిస్తాడా లేదంటే ఆ శక్తి అరుంధతికి ఇస్తాడా అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version