హీరో నాగశౌర్య సినిమాలకు దూరం కానున్నాడా..?

-

ఎట్టకేలకు యంగ్ హీరో నాగ శౌర్య వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఒక ఇంటివాడయ్యాడు.. సినిమా లైఫ్ కాస్త ఇబ్బంది పెడుతున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం హిట్ అయ్యాడని చెప్పవచ్చు. ఎవరు ఊహించని విధంగా కర్ణాటక కు చెందిన అమ్మాయిని ప్రేమించి మరీ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నాగశౌర్య సినిమాలకు దూరం కాబోతున్నాడని వార్త కూడా వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సినిమాలలో ఎలాగో సక్సెస్ అందడం లేదు.. కాబట్టి వేరే ప్రొఫెషన్ చేపట్టి అక్కడ సక్సెస్ పొందాలని ప్రయత్నం చేస్తున్నట్లు.. అందులో భాగంగానే తన భార్యతో కలిసి విదేశాలకు వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోపక్క ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి ని నాగశౌర్య ప్రేమించారు. అయితే వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీరి వివాహాన్ని జరిపించేశారు అని సమాచారం. అంతేకాదు కట్నం విషయానికి వస్థే.. అమ్మాయి బాగా రిచ్ కావడంతో భారీగానే తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . అనూష శెట్టి బ్యాక్గ్రౌండ్ కూడా బాగా బలంగా ఉండడంతో నాగశౌర్యకి కట్నంగా కొన్ని ప్రాపర్టీస్ తో పాటు సుమారుగా రూ. 50 కోట్ల వరకు డబ్బు కూడా ఇచ్చారని సమాచారం. మొత్తానికి అయితే స్టార్ హీరోల రేంజిలో నాగశౌర్య కట్నం తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

మరొకవైపు నాగశౌర్య ఇటీవల నటించిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలిచాయి. అంతేకాదు బ్రాహ్మణ అవతారం ఎత్తి .. కృష్ణ వ్రింధ విహారి సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అందివ్వలేదు. దీంతో సినిమాలకు దూరం కావాలని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version