హీరో శర్వానంద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిరంజీవి థంసప్ యాడ్ వల్ల వెలుగులోకి వచ్చిన హీరో శర్వానంద్ చిన్న నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి అనేక సినిమాలలో నటించి మంచి హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిన్న పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రన్ రాజా రన్, శతమానం భవతి , గమ్యం, ప్రస్థానం, మహానుభావుడు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో పొజిషన్ కి చేరుకున్నాడు శర్వానంద్. ఇకపోతే శర్వానంద్ గురించి ఒక రూమర్ ఇండస్ట్రీలో గట్టిగానే వినిపిస్తూ ఉంటుంది . రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో అందరికన్నా ఒక అడుగు ముందే ఉంటాడు అనే వాదన కూడా బలంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం.
హీరో శర్వానంద్ ఆస్తి విలువ అన్ని కోట్లా..?
-