టీడీపీ రెబల్‌కు సీటు కష్టాలు.. అదే డౌట్?

-

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే…అటు అధికార వైసీపీ గాని, ఇటు ప్రతిపక్ష టీడీపీ గాని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వెళ్లిపోతున్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో మరొకసారి గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ,.ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ..పోటాపోటీగా రాజకీయం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఎప్పుడు ఎన్నికల ముందు అభ్యర్ధులని ఖరారు చేసేవారు…కానీ ఇప్పుడు పరిస్తితులు మారాయి…ఇప్పటి నుంచే సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు…ఇప్పటికే చంద్రబాబు పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు.

అటు జగన్ సైతం కొన్ని సీట్లలో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు. అదే క్రమంలో సీట్లు కొందరికి ఇచ్చే అవకాశాలు కూడా లేవని చెప్పేస్తున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దక్కడం కష్టమని జగన్ ముందే హింట్ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వైపుకు వచ్చిన కరణం బలరాం పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్…ఈ నలుగురు టీడీపీని వదిలి వైసీపీ వైపుకు వచ్చారు. అయితే ఈ నలుగురు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ వీరిలో వంశీకి సీటు ఫిక్స్ అయిపోయింది. అటు గుంటూరు వెస్ట్ సీటు మద్దాలి గిరికే అని ప్రచారం జరుగుతుంది.

అలాగే విశాఖ సౌత్ లో వాసుపల్లి పోటీ చేయొచ్చని తెలుస్తోంది…కానీ ఒక్క కరణం బలరాం విషయం మాత్రమే క్లారిటీ లేదు. చీరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కరణంకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు…గత ఎన్నికల్లో ఈయన వైసీపీ నుంచి పోటీ చేసి కరణంపై ఓడిపోయారు. ఇప్పుడు కరణం వైసీపీలోకి రావడంతో అసలు సమస్య వచ్చింది. ఇక ఆమంచిని పర్చూరుకు వెళ్లాలని జగన్ కోరినట్లు తెలిసింది…కానీ పర్చూరు వెళ్లడానికి ఆమంచి ఆసక్తిగా లేరు. ఎలాగైనా తన సొంత స్థానం చీరాలలోనే పోటీ చేయాలని చూస్తున్నారు. అటు కరణం సైతం మళ్ళీ చీరాలలోనే పోటీ చేయాలని అనుకుంటున్నారు. మరి అలాంటప్పుడు చీరాల సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version