మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్‌ను అడ్డుకోవడంపై స్పందించిన సిద్ధార్థ్‌

-

కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం హీరో సిద్ధార్థ్ సినిమాకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఇటీవల తన కొత్త సినిమా చిన్నా ప్రమోషన్స్​లో భాగంగా సిద్ధార్థ్ కర్ణాటకలో ఓ ప్రెస్ మీట్​లో పాల్గొన్నారు. అయితే ఆ ప్రెస్ మీట్​ను నిరసనకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై సిద్ధార్థ్ స్పందించారు. తన సినిమాకూ అక్కడ జరుగుతున్న జల వివాదానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. దీనివల్ల చిత్రానికి భారీ నష్టం కలిగిందని తెలిపారు.

‘‘చిన్నా’ సినిమా నిర్మాతగా విడుదలకు ముందే నేను ఈ చిత్రాన్ని చాలా మందికి చూపించాలని అనుకున్నాను. అందులో భాగంగానే చెన్నైలో కొంతమందికి చూపించాను. అలాగే బెంగుళూరులో మీడియాకూ ఈ చిత్రాన్ని చూపించాలని ప్లాన్‌ చేశా. విడుదలకు ముందే 2000 మంది విద్యార్థులకు చూపించాలనుకున్నా. ఇప్పటి వరకు ఏ సినిమా దర్శక నిర్మాతలు ఇలా చేయలేదు. కానీ, బంద్‌ కారణంగా మేం అన్నింటినీ రద్దు చేశాం. దీనివల్ల మాకు భారీ నష్టం వాటిల్లింది. ప్రెస్‌మీట్‌ తర్వాత అందరికీ సినిమా చూపించాల్సి ఉంది. కానీ, అక్కడ ఏం జరిగిందో మీరంతా చూశారు. అన్ని కెమెరాల ముందు జరిగిన దాని గురించి నేను మాట్లాడదలచుకోవడం లేదు. నా సినిమాకు ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. నేను తీసే సినిమాల్లో సామాజిక బాధ్యత కనిపిస్తుందని నేను నమ్ముతున్నా’’ అని సిద్ధార్థ్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version