WORLD CUP 2023: సెమీఫైనల్ చేరే నాలుగు జట్లలో “ఆ రెండింటి మధ్య పోటీ” !

-

స్టార్ స్పోర్ట్స్ ఇటీవల రిలీజ్ చేసిన ఒక వీడియోలో వన్ డే వరల్డ్ కప్ లో సెమిస్ చేరనున్న జట్లు ఇవే అంటూ మాజీ క్రికెటర్స్ కొన్ని జట్ల పేర్లను చెప్పిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ ల పేర్లు ఉన్నాయి. కానీ సెమీస్ కు చేరే ఛాన్స్ ఉన్నది మాత్రం కేవలం నాలుగు జట్లకు మాత్రమే. అలా చూసుకుంటే ఇండియా, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా లు ఎటువంటి సందేహం లేకుండా సెమీస్ చేరుతాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం పోటీ న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికాల మధ్యన ఉండనుంది. ఇక సౌత్ ఆఫ్రికాకు బలమైన టీం ఉన్నప్పటికీ ఎప్పుడు ఎలా ఆడుతారన్నది సందేహమే. ఆ లెక్కన చూసుకుంటే సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరడం సందేహమే అని చెప్పాలి.. ఆ తర్వాత పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ లు అన్ని విభాగాలలో సమానంగా ఉన్నా… హిట్టింగ్ పవర్ కాస్త తక్కువే అని చెప్పాలి. ఉదాహరణకు నిన్న జరిగిన వార్మ్ అప్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఇచ్చిన 346 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ మరో 38 బంతులు మిగిలి ఉండగానే అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముఖ్యంగా ఓపెనర్ గా ప్రమోట్ అయిన రచిన్ రవీంద్ర విద్వంసాన్ని సృష్టించాడు… ఇక మరో యంగ్ ప్లేయర్ మార్క్ చాప్ మాన్ సైతం పాకిస్తాన్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు.. అందుకే సెమీస్ కు చేరుకునే నాలుగవ జట్టుగా వీరిద్దరిలో ఒకరు వెళ్లే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version