నిహారిక కోసం అలాంటి పని చేసిన హీరో సుమంత్ అశ్విన్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా నిర్మాత ఎమ్మెస్ రాజు టాలీవుడ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. వర్షం, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలన్నీ కూడా ఇలా సుమంత్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినవే.. ఇలా నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టడంలో విఫలమయ్యారు.

తూనీగా తూనీగా అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ అశ్విన్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా చేసిన తర్వాత ఏ సినిమా కూడా ఆయనకు పెద్దగా గుర్తింపును అందించలేదు. ఇక సుమంత్ అశ్విన్ , మెగా డాటర్ నిహారిక హీరో హీరోయిన్లుగా హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేదు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమంత్ అశ్విన్.. నిహారిక గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

నిహారిక గురించి మాట్లాడుతూ.. ఆమె అందరితో సరదాగా మాట్లాడుతూ వుంటుంది.. స్టార్ డాటర్ అనే ఈగో ఏమాత్రం కూడా కనిపించదు. చాలా సింపుల్ గా ఉండి అందరితో ఫ్రెండ్లీగా కలిసిపోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నిహారిక పుట్టినరోజు రాగా.. దీంతో చెన్నై నుంచి నా కజిన్ వస్తుంటే నిహారిక కోసం ప్రత్యేకంగా కేక్ తెప్పించి మరీ సెట్ లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసాము.. అంటూ ఈ సందర్భంగా సుమంత్ గుర్తు చేసుకున్నారు. మొత్తానికి అయితే నిహారిక మంచిది అంటూ తన కామెంట్స్ రూపంలో వెల్లడించారు సుమంత్ అశ్విన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version