బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి హీరో సూర్య హాజరు

-

టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూ.. ఓటీటీ ఆహాలో అన్ స్టాపబుల్ పేరుతో టాక్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి ఎపిసోడ్ కి చంద్రబాబు వచ్చారు. ఇప్పటికే ప్రోమోను కూడా విడుదల చేశారు. తొలి ఎపిసోడ్ ఈనెల 25న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.  సెకండ్ ఎపిసోడ్ కి తమిళ నటుడు సూర్య హాజరయ్యారు.   బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 4తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

హీరో సూర్య నటించిన కంగువ మూవీ ప్రమోషన్స్ నేపథ్యంలో ఇప్పుడు ఈ టాక్ షోకు సూర్య హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగనున్న షూటింగ్ లో కూడా అతిత్వరలోనే పాల్గొననున్నట్టు తెలిపారు. సూర్య తో పాటు బాలీవుడ్ నటుడు  బాబీ డియోల్ కూడా బాలయ్య షోకి హాజరుకానున్నాడు. కంగువ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సూర్య డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సూర్య, బాబీ డియోల్ ఎలా సందడి చేస్తారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version