హైదరాబాద్ లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల్లో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఒకటి. రోజూ ఈ ఆలయాన్ని వందల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటుంటారు. తాజాగా ఈ ఆలయానికి ప్రముఖ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ వచ్చారు. శనివారం ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అప్పటికే అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు.. వారిని చూసి షాక్ అయ్యారు.
పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఫొటోలు, సెల్పీలు దిగేందుకు వీలు లేకుండా పోయింది. రేపు ఉప్పల్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ మైదరాబాద్ జట్టు తలపడబోతోంది. ఇప్పటివరకు ఈ సీజన్ లో SRH నాలుగు మ్యాచ్ లు ఆడి ఒకటి గెలిచి, మూడు ఓడింది. మూడు మ్యాచ్ లు ఆడిన గుజరాత్ జట్టు ఒకటి గెలిచి రెండు ఓడింది. దీంతో వరుస ఓటములతో ఉన్న ఈ రెండు జట్లు.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుమీద ఉన్నాయి. మరి ఎవరిపై ఎవరూ పై చేయి సాధిస్తారో వేచి చూడాలి.