హీరో వేణు తొట్టెంపూడి తొలి వెబ్​సిరీస్ ‘అతిధి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

హీరో వేణు తొట్టెంపూడి ‘స్వయంవరం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా కాలం నుంచి ఆయన సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఆయన డిజిటల్ వేదికపై ఎంట్రీ ఇచ్చారు. వేణు ప్రధాన పాత్రలో రూపొందిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘అతిథి’. ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ఆ ఓటీటీ విడుదల చేసింది. టీజర్‌ చూస్తుంటే ఇదో హారర్‌ సిరీస్‌గా తెలుస్తోంది. ఇందులో వేణు సరసన అవంతిక మిశ్రా హీరోయిన్​గా నటించారు. భరత్‌ దీనికి దర్శకత్వం వహించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్‌ జంక్షన్‌’, ‘చెప్పవే చిరుగాలి’.. వంటి సినిమాలతో కామెడీ హీరోగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు వేణు తొట్టెంపూడి. 2013లో రిలీజైన ‘రామాచారి’ చిత్రం తర్వాత 9 ఏళ్ల పాటు సుదీర్ఘ విరామం తీసుకొన్నారు. గతేడాది రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version