డ్రగ్స్‌ కేసు.. ఎస్సై రాజేందర్‌ కాల్‌డేటాపై పోలీసుల ఆరా

-

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఎస్సై రాజేంద్ర కేసును పోలీసులు చాలా సీరియస్​గా తీసుకున్నారు. ఇంకా ఈ కేసులో ఎవరైనా అధికారులకు సంబంధాలున్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇటీవల 1750 గ్రాముల మెథకొలిన్‌ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ చరిత్రలో తొలిసారి ఒక పోలీసు అధికారి డ్రగ్స్‌ విక్రయిస్తూ అరెస్ట్‌ కావడాన్ని పోలీసు యంత్రాంగం జీర్ణించుకోలేకపోతుంది. ఈ వ్యవహారంలో ఎస్సైకు సహకరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమైనట్టు సమాచారం.

నిందితుడు రాజేంద్ర నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌పోన్లలోని కాల్‌డేటా, వాట్సాప్‌ ద్వారా సాగించిన ఛాటింగ్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 6 నెలల వ్యవధిలో తన వద్ద ఉన్న డ్రగ్స్‌ను విక్రయించేందుకు ఎవరెవరితో మంతనాలు జరిపాడనే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక ఇన్‌స్పెక్టర్‌ నుంచి పోలీసు ఉన్నతాధికారులు కొంత సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version