అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ రాధికా ఆప్టే..!

-

హీరోయిన్ రాధికా ఆప్టే గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బామ ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర తో టాలీవుడ్ కి పరిచయం అయింది. తమిళనాడుకు చెందిన ఈమె లెజెండ్, లయన్, ధోనీ వంటి సినిమాల్లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఆ తరువాత తెలుగుతో పాటు తమిళం, మరాఠీ, బెంగాళీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నటిస్తూ సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఫేమస్ బ్రిటీష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టాయ్ లర్ ను పెళ్లి చేసుకుంది.

రాధికా ఆప్టే-బెనెడిక్ట్ టాయ్ లర్ వివాహం 2021లో జరిగింది. అతి త్వరలోనే రాధికా ఆప్టే తల్లి కాబోతుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె బేబీ బంప్ ఫోటోతో చెప్పేసింది. బీఎఫ్ఐ లండన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో బేబి బంప్స్ తో దర్శనమిచ్చింది. తమ అభిమాన నటి తల్లి కాబోతుందని తెలిసిన ఫాలోవర్స్ రాధికా ఆప్టేకి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version