మహేశ్‌-రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌ యాక్టర్స్‌..?

-

దర్శకధీరుడు ఎస్​ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రం గురించి తను పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ఏదో ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో హాలీవుడ్‌ యాక్టర్స్‌ ఉండనున్నారనే వార్త గత కొన్ని రోజుల నుంచి వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై విజయేంద్ర ప్రసాద్‌ను ప్రశ్నించగా.. ఆయన దీనిపై స్పందిస్తూ.. మహేశ్‌-రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌ నటీనటులు ఉండే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఇంకా వారిని సంప్రదించలేదని.. ఇది ఆఫ్రికాలో సాగే అడ్వెంచర్స్‌ సినిమా అని క్లారిటీ ఇచ్చారు. ఇంతకు మంచి ఎక్కువ అప్‌డేట్స్‌ ఇప్పుడే వెల్లడించకూడదని అన్నారు. ఈ చిత్రం 2023 చివరి నాటికి సెట్స్‌ పైకి వెళ్లే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version