కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా -సీఎం రేవంత్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ ఫాం హౌస్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల్లో ఫాం హౌస్ ఉందని…. అందులో 500 ఎకరాలు ఇస్తే.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ భూదానం చెయ్.. ఇండ్లు కట్టించే బాధ్యత నాదన్నారు.

Indiramma will build houses in KCR Farm House said CM Revanth Reddy

జన్వాడలో కేటీఆర్ కు 50 ఎకరాలు ఉందని…. అందులో 25 ఎకరాలు ఇవ్వు.. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానంటూ సెటైర్లు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రూ. 1500 కోట్లు ఉన్నాయి.. ఒక 500 కోట్లు ఇవ్వండి.. ప్రజలకు పంచుదామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మే కదా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ చేసి తీరుతామని.. బాధితులను ఆదుకుంటామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version