ఆస్కార్ కోసం రాజమౌళి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారంటే..?

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆస్కార్ పేరు మారుమ్రోగుతున్న విషయం తెలిసిందే. అందుకు ముఖ్య కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ లో నిలవడంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వారు ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్ కి పంపించకపోవడంతో రాజమౌళి టీం ఓపెన్ క్యాటగిరిలో ఆస్కార్ కోసం పోటీ పడ్డారు.

ఫైనల్ గా ఓపెన్ క్యాటగిరిలో పోటీపడినప్పటికీ కూడా నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొంది చరిత్ర సృష్టించింది. ఆస్కార్ అవార్డుకి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అయితే ఆస్కార్ నామినేషన్ కోసం రాజమౌళి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు వైరల్ గా మారుతోంది. దేశం తరఫున అధికారికంగా సినిమాను ఆస్కార్ నామినేషన్స్ కు పంపించకపోవడం వల్లే రాజమౌళి అండ్ టీం చాలా శ్రమించింది. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం.

అసలు విషయంలోకెళితే రాజమౌళి ఆస్కార్ నామినేషన్స్ కోసం దాదాపు రూ.110 కోట్లు ఖర్చు చేశారు అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి స్క్రీన్స్ లో స్క్రీనింగ్, గెస్ట్ లకు, పిఆర్ ని మెయింటెన్స్ మొదలుకొని ప్రతి విషయంలో కూడా కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఖర్చు భరించలేక కొన్ని సినిమాలు ఆస్కార్ పోటీ నుంచి తప్పుకుంటుంటే.. ఆస్కార్ అందుకొని టాలీవుడ్ క్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటి చెప్పడానికి రాజమౌళి మాత్రం ఎక్కడ వెనుకడుగు వేయలేదు. ఏదేమైనా రాజమౌళికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై ఉన్న విశ్వాసం, ప్రేమ అతీతమైనవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version