చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.

జైలర్ నటుడు కన్నుమూశాడు. ప్రముఖ తమిళనాడు మరియు డైరెక్టర్ జి మారి ముత్తు ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఇతను ఇప్పటివరకు వందకు పైగా సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా విక్రం మరియు జైలర్ సినిమాలలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా జైలర్ సినిమాలో విలన్కు నమ్మకస్తుడి పాత్రలో మారుమూత్తు నటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన మృతి నేపథ్యంలో సినిమా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.