బంపర్ ఆఫర్ కొట్టేసిన హైపర్ ఆది.. ఏకంగా ఆ స్టార్ చిత్రంలో..!!

-

బుల్లితెరపై మకుటం లేని మహారాజుగా ఒక వెలుగు వెలుగుతున్నారు కమెడియన్ హైపర్ ఆది. మొదట జబర్దస్త్ షో తో తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో షోలలో కమెడియన్గా కనిపిస్తూ సందడి చేశారు హైపర్ ఆది. ఇక అంతే కాకుండా ఒకవైపు సినిమాలతో మరొకవైపు బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైపర్ ఆది వేసే పంచ్ డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో సుధీర్, అనసూయ తదితర కమెడియన్ లు సైతం జబర్దస్త్ వీడి వెళ్లిపోవడంతో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ తో తన హవా కొనసాగిస్తూ ఉన్నారు హైపర్ ఆది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో హైపర్ ఆది నటించడం జరిగింది.

ఇప్పుడు తాజాగా మళ్లీ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో హైపర్ ఆదికి అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హైపర్ ఆది ది కీలకమైన పాత్ర. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాలో హైపర్ ఆది కి కీలకమైన పాత్రను కేటాయించినట్లుగా తెలుస్తున్నది. ఒకవేళ హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మంచి హిట్ అయిందంటే ఇకమీదట పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమాలో కూడా హైపర్ ఆది కనిపించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తోంది.

గతంలో పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ కాంబినేషన్ అంటే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేది. ఇప్పుడు ఆలి స్థానంలో హైపర్ ఆది వచ్చాడంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ఆఫర్లు వచ్చినా హైపర్ ఆది మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ తదితర షోలను మాత్రం విడిచి పెట్టనని తెలియజేసినట్లు తెలుస్తున్నది. మరి పవన్ కళ్యాణ్ తో హైపర్ ఆది సక్సెస్ అవుతారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version