టీడీపీ పార్టీలోకి ఆదిమూలపు సురేష్ వెళతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల్లోనే.. టీడీపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని ఆదిమూలపు సురేష్ గురించి జోరుగా అయితే.. ప్రచారం జరిగింది. అయితే.. ఈ ప్రచారం.. స్వయంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని చెప్పారు. మంత్రి బాల వీరంజనేయ స్వామి ఏ నిప్పు చూసి మాట్లాడాడో తనకు కూడా తెలియదని వైసీపీ నిప్పుని తాకాలని చూస్తే చేతులు కాలుతాయన్నారు.
గుడ్డ కాల్చి మీద వేసే పాత టెక్నిక్స్ ఇప్పుడు పనిచేయవని చురకలు అంటించారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. అటు మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీ పార్టీలోకి రావడంపై మంత్రి బాల వీరంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తనతో టచ్ లో ఉన్నారనేది వాస్తవం కాకపోయినా నిప్పులేనిదే పొగ మాత్రం రాదంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.