ప్రతీ చోట నిన్నే వెతుకుతున్నా అమ్మ.. జాన్వి కపూర్

-

అతిలోకసుందరి శ్రీదేవి మరణించి నేటికి ఐదేళ్లు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ శ్రీదేవి చనిపోయింది అనే విషయం ఆమె అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు సైతం ఒప్పుకోలేరు. ఈ రోజుకి ఆమె సినిమాలు చూస్తే శ్రీదేవి మనతోనే ఉందనే అభిప్రాయం కలుగుతుంది. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులకే ఇంత బాధగా ఉంటే శ్రీదేవి కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే త్వరలోనే శ్రీదేవి డెత్ యానివర్సరీ ఉండగా సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్ తల్లిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు..

బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఇంస్టాగ్రామ్ వేదికగా తన తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికే ఆమె చనిపోయి ఐదేళ్లు అవుతున్నప్పటికీ ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ తల్లిని తలుచుకుంటూ ఆమెతో ఉన్న అనుభూతులు గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు జాన్వి. అలాగే తాజాగా.. “నేను ఇప్పటికీ ప్రతీ చోటా నిన్నే వెతుకుతున్నాను అమ్మా.. ఇప్పటికీ నేను చేసే ప్రతి పనిని నువ్వు గర్వించేలా చేస్తున్నానని ఆశిస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా.. నేను చేసే ప్రతి పని కూడా మీతోనే మొదలవుతుంది. మీతోనే ముగుస్తుంది..” అంటూ ఎమోషనల్ అయింది. వేదికగా జాన్వికపూర్ పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది చూసిన శ్రీదేవి అభిమానులంతా మరొకసారి ఎమోషనల్ అవుతున్నారు.

శ్రీదేవి సౌత్ సినిమాల్లో నటించి సూపర్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వత బాలీవుడ్లోకి అడుగు పెట్టారు. అయితే శ్రీదేవి తనయ జాన్వి కపూర్ మాత్రం ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాల్లోనే ఉండిపోయారు. ఈమె సౌత్ సినిమాల ఎంట్రీ పై ఎన్నో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే వీటన్నిటిని కొట్టిపారేస్తూనే ఉన్నారు బోనికపూర్. అయితే త్వరలోనే జాన్వి ఎన్టీఆర్ తో సినిమా చేయనుందని ఇందుకు సన్నాహాలు జరిగాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జాన్వి కూడా సౌత్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తూనే వస్తున్నారు. మరి ఏమవుతుందో త్వరలోనే చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version