ఎల్బీ స్టేడియంలో సురేఖ వాణి అలా చేస్తారని ఊహించలేదు.. ఉత్తేజ్..!

-

అవధాని గరికపాటి నరసింహారావు.. విజయదశమి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాదులో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా తన గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయపథం వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో ఆయనకి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఇకపోతే ఈ కార్యక్రమంలోని ఒక చిన్న వాగ్వాదం జరిగిందని చెప్పవచ్చు.. అసలు విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి తన సినిమా దిగ్విజయాన్ని పురస్కరించుకొని బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు హైదరాబాదులో జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరవ్వడానికి అక్కడికి వచ్చారు . ఇక చిరంజీవిని చూసిన యువతి యువకులు చిరంజీవితో సెల్ఫీలు దిగడం ప్రారంభించారు. కానీ అప్పటికే గరికపాటి ప్రసంగం మొదలుపెట్టడంతో ఆయన ప్రసంగాన్ని ఎవరు వినకపోవడం ఆయనను ఆగ్రహానికి గురిచేసింది దాంతో బహిరంగంగా చిరంజీవి మీద గరికపాటి అసహనం ప్రకటించారు.

ఇక చిరంజీవి కూడా గరికపాటికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే దీనిపై టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆర్జీవి సైతం గరికపాటి బిహేవియర్ ను తప్పు పడుతూ ట్వీట్స్ చేశాడు . ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ప్రముఖ నటుడు ఉత్తేజ్ కూడా కొన్ని విషయాలను బయటపెట్టారు. ఉత్తేజ్ మాట్లాడుతూ.. చిరంజీవి ప్రారంభించిన బ్లడ్ బ్యాంకు దగ్గర సుమారుగా 300 మంది లైన్లో ఉంటారు. వారందరూ రక్తదానం చేసే వరకు అన్నయ్య అలాగే కదలకుండా ఉంటారు. వచ్చిన వాళ్లందరూ మాత్రం మారిపోతూ ఉంటారు. ఇక ఒక స్టార్ హీరోతో అభిమాని దిగే ఫోటోకు ఎలాంటి విలువ.. అభిమానం ఉంటాయో అన్నయ్యకు తెలుసు.. ఎవరైనా ఫ్యామిలీ వెళ్లి ఆయనతో ఫోటో దిగితే రెండు మూడు గంటల్లో వాళ్ళ ఇంటిలో ఆ ఫోటో ఉంటుంది.

ఇక్కడి కెమెరా మాన్ తో ఫోటో తీయించుకుంటారు. ఫోటో దిగాము కానీ.. వస్తుందో రాదో అనే టెన్షన్ వారిలో ఉంటుంది ..కానీ వెంటనే వాళ్ళ ఇంటికి ఫోటోలు పంపిస్తారు. అభిమానులతో ఫోటో అంటే అన్నయ్య అంత వాల్యూ ఇస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిరంజీవి గారిని ముట్టుకుంటే గుక్క పట్టి ఏడ్చేస్తూ కూడా ఉంటారు. అలాంటి వారిలో నేను కూడా ఒకరు. ఆరోజు 8-9-1996 సారథి స్టూడియోలో మధ్యాహ్నం 3:45 గంటలకు మొదటిసారి అన్నయ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చాను.హిట్లర్ షూటింగ్ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మొదటిసారి ఆయనను ముట్టుకోగానే సంతోషంతో తట్టుకోలేక ఏడ్చాను. ఇలాంటి అనుభవం సురేఖ వాణి కి కూడా ఎదురయ్యింది. ఎల్బి స్టూడియోలో సురేఖ వాణి చిరంజీవిని ముట్టుకొని గుక్క పట్టి ఏడ్చింది అంటూ అసలు విషయాన్ని తెలిపారు ఉత్తేజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version