బుల్లితెరపై పాపులర్ షో బిగ్‌బాస్ షో ఎంత పాపులర్ అయ్యిందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బిగ్‌బాస్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా పెళ్లి పీటలెక్కుతోంది. కన్నడ ర్యాపర్ స్టార్ చందన్, హీరోయిన్ నివేదిత గౌడ్‌లో కన్నడ బిగ్‌బాస్ సీజన్ -6లో పాల్గొన్నారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించింది. చివరకు ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లికి దారితీసింది.
బిగ్‌బాస్ హౌస్‌లో వారిద్దరూ మంచి స్నేహితులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుమించి వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ షో జరుగుతున్నప్పుడే చాలా మంది వీరు ప్రేమలో ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు అదే నిజం అయ్యింది. బయటకు వచ్చాక వీరు నిజమైన ప్రేమికులుగా మారిపోయారు. తమ ప్రేమ గురించి ఇటీవలి దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఓ వేదికపై తమ వివాహాన్ని వీరు ప్రకటించారు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన దసరా ఉత్సవాల వేదికపై పెళ్లి ప్రకటన ఏంటని విమర్శలు రాగా, క్షమాపణలు కూడా చెప్పారు. తాజాగా నిన్న చందన్, నివేదితల నిశ్చితార్థం బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని, అభిమానుల సమక్షంలో తమ వివాహం జరుగుతుందని ఈ సందర్భంగా వారిద్దరూ తెలిపారు. అపోహలకు తావివ్వరాదనే తామందరం ఈ నిర్ణ యాన్ని తీసుకున్నామన్నారు. మొత్తానికి వీరి ప్రేమ కథకు పెళ్లితో తెరపడుతోంది.