ఏపీ కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక కామెంట్స్..!

-

డీజీపీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు ఏపీ కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సీఎం చంద్రబా చెబుతున్న 2047 విజనల్ అమలుకు రాష్ట్ర శాంతి భద్రతలు కీలకంరాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టారు. నా హయంలో కూడా అవి కొనసాగుతాయి అని తెలిపారు. అలాగే టీం వర్క్ తోనే మంచి ఫలితాలు సాధిస్తాం. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు చేస్తాం.

AI టెక్నాలజీతో మరింత వేగంగా కేసుల పురోగతి చేపడతా.. భూ కబ్జాలు, ఆర్గనైజ్డ్ క్రైం చేసే వారిని ఉపేక్షించం. సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణ కోసం ప్రతి జిల్లాలో స్టేషన్ ఏర్పాటు చేస్తాం. గ్రే హౌండ్స్, పోలీసుల మౌలిక సౌకర్యాలు కల్పన, పోలిసుల సంక్షేమం, అప్పా ఏర్పాటుపై పని చేస్తాం. డయల్ 100 వంటి సేవలు రెస్పాన్స్ టైం మరింత వేగవంతం చేస్తాం. సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా కఠినంగా ఉంటాం. సైబర్ నేరాల నియంత్రణ కోసం 200 మంది సైబర్ కమెండోలను తయారు చేస్తున్నాం అని ఏపీ కొత్త డీజీపీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version