సమంత అమెరికాకు వెళ్తున్నది ట్రీట్మెంట్ కోసం కాదా..?

-

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత మయోసైటీస్ నుంచి కోలుకున్న తర్వాత మరింత మెరుగ్గా తయారవ్వడానికి సినిమాలకి కొంతకాలం గ్యాప్ ఇచ్చి అమెరికాకు వెళ్లాలని నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజులు విదేశాలకు వెళ్లి అక్కడ చికిత్స కోసం పలు హాస్పిటల్స్ తిరుగుతోంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ ఆమె తన స్నేహితులతో కలిసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసిందట. అలా విహారయాత్రను ముగించి తాజాగా హైదరాబాద్ కి చేరుకొని వెంటనే ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ లో పాల్గొని సందడి చేసింది.

అంతే కాదు విజయ్ దేవరకొండ తో కలిసి స్టేజ్ పైనే డాన్స్ కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా ఈమె మరొకసారి విదేశీ పర్యటన షురూ చేసిందని సమాచారం. నిన్న మొన్నటి వరకు స్నేహితులతో కలిసి ఇండోనేషియాతో పాటు పలు ప్రాంతాలలో పర్యటించిన సమంత ఈసారి తన తల్లితో కలిసి న్యూయార్కు వెళ్లిందట. అయితే ట్రీట్మెంట్ కోసమే అమెరికా వెళ్లి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా, దృఢంగా తయారవడానికి కొన్ని వారాలపాటు చికిత్స తీసుకుంటుందని కూడా చెబుతున్నారు.

అయితే ఇందులో నిజం లేకపోయింది..ఎందుకంటే న్యూయార్క్ లో జరగనున్న ఇండియా డే పరేడ్ లో పాల్గొనడానికి సమంత వెళ్ళింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి హీరోయిన్లు కూడా న్యూయార్క్ చేరుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సమంత కూడా ఇలాగే వెళ్లి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి సమంత మాత్రం పూర్తి ఆరోగ్యంతో ఇండియాకు తిరిగి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news