స్నేహ ఉల్లాల్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం అదేనా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఒకటి రెండు సినిమాలలో నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఎంతోమంది తమ అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడమే కాకుండా మరింత ఇమేజ్ను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతూ ఉంటారు.. నిజం చెప్పాలంటే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది వరుస సినిమాలతో దూసుకుపోతే మరికొంతమంది ఒకటి రెండు సినిమాల తర్వాత తెరమరుగవుతూ వుంటారు. అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ స్నేహ ఉల్లాల్ కూడా ఒకరు.

ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన స్నేహ ఉల్లాల్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా జూనియర్ ఐశ్వర్య రాయ్ గా పేరు సంపాదించుకుంది. ఇకపోతే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఐశ్వర్యరాయ్ అభిమానులు కూడా ఈమెకు అభిమానులుగా మారిపోయారు. పోతే అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్ ఉన్నట్టుండి సినిమాలకు దూరం అవడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఉన్నట్టుండి సినీ ఇండస్ట్రీకి స్నేహఉల్లాల్ దూరం కావడానికి కారణం ఆమె ఏదో జబ్బు తో బాధపడుతున్నట్లు సమాచారం.

రక్త సంబంధిత వ్యాధి.. దీనిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ఎక్కువ సేపు నిలబడ లేక పోయే వారట. ఇక పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో అలా తన నటనకు స్వస్తి పలికి పూర్తిగా సినిమాకు దూరం అయింది స్నేహాఉల్లాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version