మనోజ్ – మౌనిక ల రెండవ పెళ్లికి అసలు కారణం ఇదేనా..?

-

మంచు మనోజ్ – మౌనిక రెడ్డి వివాహం ఇటీవల మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఈ పెళ్లికి పలువురు ప్రముఖులు , రాజకీయ నాయకులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే ఈ జంట తాజాగా తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. మౌనిక తో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని నాలుగేళ్లుగా ఇద్దరం చాలా బాధలు పడ్డాం అంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఇకపోతే వీరిద్దరి పరిచయం వెనుక అసలు కారణం లొకి వెళితే మనోజ్ మౌనిక పరిచయం ఇప్పటిది కాదు దాదాపు 12ఏళ్ల క్రితమే విదేశాలలో ఉన్నప్పుడే పరిచయం ఏర్పడింది. న్యూయార్కులో భూమా మౌనిక రెడ్డి చదువుల కోసం స్విన్ బోయిన్ యూనివర్సిటీలో చేరి.. అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత న్యూయార్క్ ఫిలిం అకాడమీలో బ్రాడ్ కాస్టింగ్ జర్నలిజంలో చేరింది. అయితే మంచు మనోజ్ కూడా న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశాడు. అలా వీరిద్దరి మధ్య న్యూయార్క్ ఫిలిం అకాడమీ లోనే స్నేహం చిగురించింది.

అయితే మౌనిక మనోజ్ ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చుకొని ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు . కానీ అంతలోపే మౌనిక తండ్రి నాగిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో వివాహం కుదుర్చారు. ఆ తర్వాత మనోజ్ కూడా ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు.. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఎవరికి వారు విడాకులు తీసుకోవడం జరిగింది.. కానీ గత నాలుగేళ్లుగా ఒంటరిగా ఉన్న వీరిద్దరూ మళ్లీ తమ పాత ప్రేమను బయట పెట్టుకున్నారు. ఇప్పుడు మంచు లక్ష్మి నివాసంలో ఘనంగా వివాహ చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version