ఉమెన్స్ డే స్పెషల్: మహిళల కేంద్ర అదిరే ప్రభుత్వ పథకాలు.. ఓ లుక్ వేసేయండి..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి రుణాలను అందిస్తోంది. అయితే మహిళల అభివృద్ధి కోసం కూడా ఎన్నో రకాల పథకాలను తీసుకురావడం జరిగింది. కాకపోతే సరైన అవగాహన లేకపోవడం వలన చాలా శాతం మంది వాటిని వినియోగించుకోవడం లేదు. ఈ పధకాలతో మహిళలు ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

అన్నపూర్ణ స్కీమ్:

చాలా మంది మహిళలు ఫుడ్ మరియు కేటరింగ్ వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటారు. అటువంటి మహిళలకు అన్నపూర్ణ పథకం ద్వారా 50 వేల వరకు రుణాలను అందించడం జరుగుతుంది మరియు తిరిగి ఆ రుణాన్ని 36 ఇన్స్టాల్మెంట్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి వడ్డీ రేటు బ్యాంకు మరియు ప్రాంతం ప్రకారం మారుతూ ఉంటుంది. అన్నపూర్ణ పథకంలో రుణాన్ని తీసుకున్న మహిళలు మూడేళ్లలో తిరిగి చెల్లించాలి.

స్త్రీ శక్తి స్కీం

ఈ పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు 50 లక్షల వరకు వ్యక్తిగతంగా రుణాన్ని అందజేయడం జరుగుతుంది. ఉమ్మడి వ్యాపారం అయితే మహిళలకు కనీసం 50% వరకు వాటా ఉండాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఐదు లక్షల వరకు రుణాన్ని పొందితే ఎటువంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పథకంలో భాగంగా ఇచ్చిన రుణానికి వడ్డీ రేటు క్రెడిట్ హిస్టరీ, వ్యాపారం అవసరాలు ప్రకారం ఉంటుంది. రుణాన్ని పొందిన మహిళలు ఏడాది నుంచి ఐదేళ్ల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగిని స్కీం:

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళా వ్యాపారాలును అభివృద్ధి చేయడానికి లక్ష రూపాయల నుండి రుణాన్ని అందజేస్తోంది. అయితే ఈ పథకంలో భాగంగా 40,000 కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న మహిళలు మాత్రమే అర్హులు మరియు 18 నుండి 55 ఏళ్ల మధ్య ఉండే మహిళలు అందరూ అర్హులు.

స్టాండప్ ఇండియా స్కీమ్:

ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ క్యాస్ట్ కు చెందిన మహిళలు రుణాన్ని పొందవచ్చు. ఈ పథకంలో భాగంగా 10 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. రుణాన్ని సులభంగా అందించేందుకు రూపే డెబిట్ కార్డును కూడా అందజేయడం జరుగుతుంది. అధికారిక వెబ్సైట్ సిడ్బీ ద్వారా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా వ్యాపారాలను ప్రారంభించి మహిళలు అభివృద్ధి పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version