మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపై ఐటీ దాడులు !

-

మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయట. హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు చోట్ల ఐటీ దాడులు ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.

IT attacks on Mythri Movie Makers, Mango Media

ఈ తరుణంలోనే… టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజుకు బిగ్‌ షాక్‌ తగిలింది. టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇక పుష్ప2 మూవీ మైత్రీ సంస్థ మీద కూడా జరుగుతున్నాయి ఐటి దాడులు. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు మాంగో మీడియా సంస్థ లోకూడా సోదాలు జరుగుతున్నాయి. సింగర్ సునీత భర్త ..రాము కు సంబంధిన సంస్థ మాంగోపై దాడులు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version