భారీగా సంపాదిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఆస్తులు ఎంతో తెలిస్తే షాక్..!

-

ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎక్కువగా ఐటెం సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తన ఆటపాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అందచందాలతో బోల్డ్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న జాక్వెలిన్ గత రెండు సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్తున్నప్పుడు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ పోర్ట్ అధికారులు, ఈడీ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి ఈమె పేరు ఇంకా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డ్రగ్స్ మాఫియా డాన్ సుఖేష్ చంద్ర అనే వ్యక్తి దగ్గర నుంచి సుమారుగా రూ.10 కోట్ల విలువైన బహుమతులు తీసుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు డ్రగ్స్ కేసులో ఈమెకు ఈడి అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక అప్పట్లోనే నెటిజెన్లు సోషల్ మీడియా ద్వారా ఆమె ఆస్తులు ఎంత అని గూగుల్ సర్చ్ చేయగా అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఆమె ఆస్తులు తెలిసి ఆశ్చర్యపోయారు. 2011లో మర్డర్ 2 అనే సినిమా ద్వారా మొదటి సక్సెస్ ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాలు, షోలు చేస్తూనే బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా కూడా భారీగానే సంపాదించింది.

ముఖ్యంగా ఏడాదికి రూ.10 కోట్లకు పైగా సంపాదించే జాక్వెలిన్.. సుమారుగా ఆమె ఆస్తులు రూ.120 కోట్లకు పైగా చేరుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా విలువైన లగ్జరీ కార్లతో పాటు శ్రీలంకలో సొంత దీవి కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను అలరిస్తూ సోషల్ మాధ్యమాల ద్వారా కూడా భారీగా సంపాదిస్తోందని సమాచారం. ఏది ఏమైనా ఈమె ఆస్తి ముందు యంగ్ హీరోయిన్లు కూడా తక్కువే అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version