Jani Master Case: టాలీవుడ్‌‌లో ప్రకంపనలు.. జానీ మాస్టర్ కు నోటీసులు !

-

జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జానీ మాస్టర్‌కు పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. ఇంకా పరారీలోనే జానీ మాస్టర్ కు హైదరాబాద్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారట. కోరియోగ్రాఫర్ జాని మాస్టర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. లైంగిక దాడి కేసులో విచారణ వేగవంతం చేసిన నార్సింగ్ పోలీసులు..తాజాగా జానీ మాస్టర్‌కు నోటీసులు ఇచ్చారు. బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు… ఇప్పటికే కేసు వివరాలు సేకరించారు.

వైద్యపరీక్షలు పూర్తి అయ్యాయి. మరికొన్ని ఆధారాల సేకరణ కోసం నేడు బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలికి లైంగిక వేదింపులు జరిగినట్లు గుర్తించారు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ బెదిరింపులకు దిగాడట. జానీ బాషాకు వ్యతిరేఖంగా స్వరం పెంచింది సినిమా ఇండస్ట్రీ. టాలివుడ్ లైంగిక వేదింపుల పరిష్కార ప్యానల్ కూడా దీనిపై విచారణ జరుపుతోందట. భాదితురాలి పిర్యాదును ఇప్పటికే రికార్డ్ చేసింది ప్యానల్.
ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్న ప్యానల్..త్వరలోనే బయట పెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version