పరారీలో జానీ మాస్టర్.. రహస్య ప్రదేశంలో!

-

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ హైదరాబాదులోని రాయ్ దుర్గ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు బెదిరింపు (506), గాయపరచడం (323), క్లాజ్ (2) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని పోలీసులు అక్కడికి బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాదిత మహిళని ఓ రహస్య ప్రదేశంలో విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఔట్ డోర్ షూటింగ్స్ లో జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ. ప్రస్తుతం జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.

2017లో ఢీ షోలో జానీ మాస్టర్ తో తనకు పరిచయం అయిందని ఎఫ్ఐఆర్ లో వెల్లడించింది ఆ మహిళ. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యానని.. ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళగా అక్కడ హోటల్ లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేశాడని జానీ మాస్టర్ పై ఆ మహిళ ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version