‘RRR’ ప్రమోషన్స్ కోసం జపాన్‌కు కొమురం భీమ్

-

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో జక్కన్న చెక్కిన అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్లకుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. ఇప్పటికే పాన్ ఇండియా వ్యాప్తంగా అదరగొట్టిన ఈ సినిమా ఈనెల 21న జపాన్ లోనూ విడుదల కానుంది.

జపాన్ కు సంబంధించి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ జ‌ప‌నీస్ మీడియాతో చిట్ చాట్ లో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జపాన్‌కు బయలుదేరాడు తారక్‌.

ట్రావెల్‌ బ్యాగ్‌ అండ్‌ సూట్‌కేస్‌తో తారక్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్తున్న స్టిల్స్‌ ఇపుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ త్వరలోనే జపాన్‌లో కూడా రికార్డుల వేట మొదలుపెట్టనుందని తారక్‌ ప్రమోషన్స్‌ అప్‌డేట్‌తో అర్థమవుతోంది. పీరియాడిక్  డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో నటించగా.. ఎన్టీఆర్ కొమురంభీం పాత్ర‌లో న‌టించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version