సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన మీద జూ.ఎన్టీఆర్ రియాక్షన్ ఇచ్చారు. ఈ ఘటన తెలియగాని షాక్ అయ్యానని ‘X’ లో తారక్ పోస్ట్ పెట్టారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేసిన జూ.ఎన్టీఆర్… ఎమోషనల్ అయ్యారు.
కాగా, ముంబై లీలావతి ఆసుపత్రిలో సైఫ్ ఆలీఖాన్ కు చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లో సైఫ్ ఆలీఖాన్ కు కత్తిపోట్లు చోటు చేసుకున్నాయి. బాంద్రాలో తన ఇంట్లో చోరీకి యత్నించాడు దుండగుడు..అయితే అడ్డుకున్న పనిమనిషికి తీవ్ర గాయాలు అయ్యాయి. గొడవ జరుగుతుండగా వచ్చిన సైఫ్ ను కత్తితో పొడిచాడు దుండగుడు. దింతో ముంబై లీలావతి ఆసుపత్రిలో సైఫ్ ఆలీఖాన్ కు చికిత్స కొనసాగుతోంది. ఈ తరుణంలోనే సైఫ్ ఆలీఖాన్ హేలాత్ అప్డేట్ వచ్చింది. మొత్తం సైఫ్ ఆలీఖాన్ కు ఆరు కత్తి పోట్లు జరిగాయట. అందులో రెండు డెప్త్ ఎక్కువ ఉన్నాయని సమాచారం.