ట్రెండ్ ఇన్: దర్శకుడు కొరటాల శివకు న్యాయం చేయండి..చిరంజీవికి నెటిజన్ల డిమాండ్!!

-

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తన సినిమాల ద్వారా సామాజిక సందేశాలిస్తుంటారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘ఆచార్య’..బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాతో కొరటాల శివ తొలిసారి తన కెరీర్ లో అపజయం పాలయ్యారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ పిక్చర్..ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ సంగతులు పక్కనబెడితే..ఈ ఫిల్మ్ కోసం నిర్మాతలు ఖర్చు చేసిన అమౌంట్ భారీగా ఉన్న నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు దర్శకుడు కొరటాల శివ ముందుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకునేందుకు దర్శకుడు కొరటాల శివ..తన సొంత ప్రాపర్టీస్ ను అమ్ముకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ క్రమంలోనే దర్శకుడిని సపోర్ట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందకు రావాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా #JusticeforKoratalaShiva.. జస్టిస్ ఫర్ కొరటాల శివ ..అనే హ్యాష్ ట్యాగ్ తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ‘ఆచార్య’ చిత్రంలోని చిరు-చరణ్ ల మధ్య సీన్ ఒక దానిని జోడించి ట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు. ‘తాను కావాలని పొడవలేదని వాడే వచ్చి గుచ్చుకున్నాడు’ అని చిరంజీవి చెప్పిన డైలాగ్ వీడియో షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తారక్ తో చేయబోయే NTR 30 ఫిల్మ్ ద్వారా దర్శకుడు కొరటాల శివ తన సత్తా ఏంటో చూపుతారని మరి కొందరు నెటిజన్లు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫిల్మ్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, వీడియో ..అంచనాలను బాగా పెంచేసింది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొరటాల శివ ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా నాలుగేళ్ల పాటు శ్రమించి ‘ఆచార్య’ పిక్చర్ తీశారని, కానీ, అది అనుకున్న స్థాయిలో ఆడలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కొరటాల శివకు చిరంజీవి, రామ్ చరణ్ అండగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version