తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు 110 పరుగులకే ఆల్ అవుట్ కాగా… తర్వాత చేదనకు దిగిన టీమిండియా లక్షాన్ని 18.4 ఓవర్లలోనే చేదించింది. తద్వారా ఇంగ్లాండ్ గడ్డ మీద… ఇంగ్లాండ్ వన్డే చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఓడించింది ఇండియా.ఇప్పుడు వరకు వన్డేల్లో ఇంగ్లాండ్ స్వదేశంలో ఎప్పుడూ కూడా 10 వికెట్ల తేడాతో ఓడిపోలేదు.
ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కొట్టిన భారీ సిక్సర్ కారణంగా ఓ చిన్నారికి గాయం అయింది. ఇన్నింగ్స్ 5 వ ఓవర్ లో డేవిడ్ విల్లీ వేసిన ఓ బంతిని ఫుల్ షాట్ ఆడాడు రోహిత్. ఈ నేపథ్యంలోనే.. ఆ బంతి స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన ఓ పాపకు బలంగా తాకింది. దీంతో ఆ పాప నొప్పిని తట్టుకోలేక విలవిలలాడింది. వెంటనే ఇంగ్లాండ్ ఫిజియోలు ఆ పాపకు మెడికల్ చెకప్ చేశారు. చెకప్ తర్వాత ఆ పాపకు పెద్దగా గాయాలు కాలేదని నిర్ధారించారు. ఆమెకు బాగానే ఉందని నిర్ధారించుకున్న తరువాత మ్యాచ్ నీ కొనసాగించారు.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్టాండ్స్ లో ఉన్న ఆ చిన్నారి ఆరేళ్ళ బాలిక మీరా సాల్వినీ కలుసుకున్నాడు. ఆమెకు సారీ చెప్పడమే కాకుండా ఓ టెడ్డీబేర్ బొమ్మ, చాక్లెట్స్ కూడా ఇచ్చాడు. రోహిత్ శర్మ చేసిన ఈ పని పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ చిన్నారితో ఉన్న రోహిత్ శర్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
— Guess Karo (@KuchNahiUkhada) July 12, 2022